ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (16:23 IST)

ఢిల్లీలో 12 సంవత్సరాల తర్వాత ఒకే రోజు అత్యధిక వర్షపాతం

దేశ రాజధాని ఢిల్లీలో 12 సంవత్సరాల తర్వాత ఒకే రోజు అత్యధిక వర్షాపాతం నమోదైంది. నగరంలో 24 గంటల్లో 112.1 మిల్లీమీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు మోకాలి లోతు నీటిలో మునిగిపోయాయి. వరదలు నగరంలో ట్రాఫిక్‌పై తీవ్ర ప్రభావం చూపింది. 
 
భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఢిల్లీలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో సగటున 125.1 మిల్లీ మీటర్ల వాన కురుస్తుందని అంచనా. ఇందులో 95శాతం వర్షాపాతం బుధవారం ఒకే రోజు రికార్డయ్యింది. వాతావరణ మార్పుల కారణంగా రుతువనాల నమూనా మారుతోందని స్కైమెట్‌ వెదర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌ పలావత్‌ పేర్కొన్నారు. గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల్లో వర్షం కురిసే రోజులు తగ్గిందని, తీవ్రమైన వాతావరణ సంఘటనలు పెరిగాయన్నారు.