అమ్మవారి విగ్రహాన్ని ముక్కలుగా చేసి, విగ్రహం తలను..?
పశ్చిమ బంగ్లాదేశ్‌లోని జెనైదా జిల్లాలోని దౌతియా గ్రామంలో పురాతన కాళీమాత ఆలయంపై దాడి జరిగింది. అమ్మవారి విగ్రహాన్ని ముక్కలుగా చేసి, విగ్రహం తలను తీసుకుని ఆలయ ప్రాంగణం నుండి అర కిలోమీటరు దూరంలో ఉన్న రహదారిపై పడవేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు సుకుమార్ చెప్పారు.
కాళీ దేవాలయం అఖండ భారత దేశంగా ఉన్నప్పటి నుంచి హిందువుల ప్రార్థనా స్థలం. ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దసరా నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి.
మండపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలను విజయదశమి రోజున వివిధ నదుల్లో నిమజ్జనం చేశారు. జెనైదాలోని ఆలయంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని బంగ్లాదేశ్ పూజా సెలబ్రేషన్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి చందనాథ్ పొద్దార్ తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు జెనైదా పోలీస్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అమిత్ కుమార్ బర్మన్ తెలిపారు.