చెన్నైలో అట్టహాసంగా ఇద్దరు యువతుల వివాహం.. బ్రాహ్మణ సంప్రదాయంలో పెళ్లి..
చెన్నైలో ఇద్దరు యువతుల వివాహం అట్టహాసంగా జరిగింది. వీరిద్దరు ప్రేమించుకున్నారు ఆపై సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులే బ్రాహ్మణ సంప్రదాయ పద్ధతిలో వారి వివాహాన్ని ఘనంగా జరిపించారు. ఇద్దరు యువతులు తమ తండ్రులు ఒడి కూర్చుని పూలదండలు మార్చుకున్నారు.
పెళ్లి చేసుకున్న యువతుల్లో ఒకరు తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుభిక్ష సుబ్రమణి కాగా, మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన యువతి టీనా దాస్. వీరిద్దరూ గత ఆరేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలిసింది.
తమ ఇళ్లలో పెద్దలను ఒప్పించడానికి ఇంతకాలం పట్టిందని సుభిక్ష వెల్లడించింది. తమ వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారని కలలో కూడా ఊహించలేదని తెలిపింది. దీనిపై సుభిక్ష-టీనా హర్షం వ్యక్తం చేసింది.