శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (22:46 IST)

ఆ బస్సులో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్న అమ్మాయి మీ అమ్మాయి కాకపోవచ్చు కానీ....

image
మహిళా భద్రతా చాలాసార్లు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒంటరిగా తిరగాలంటే జంకుతూ వెళ్లాల్సిన పరిస్థితులు అప్పుడప్పుడు అమ్మాయిల ముందు తారసపడుతుంటాయి. ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియక అయోమయంలో వుండాల్సిన పరిస్థితి తలెత్తుతుంటుంది.

 
ప్రైవేట్ వాహనాల్లో సేఫ్టీ వుండదని ప్రజా రవాణాను ఆశ్రయించినా కూడా అప్పుడప్పుడు అమ్మాయిలకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్న ఘటనలు తెలుస్తూనే వున్నాయి. ఈ నేపధ్యంలో బాలికల రక్షణపై ఓ ప్రకటన విడుదల చేసారు.

 
ఈ ప్రకటనకు చెందిన వీడియోలో ఓ బాలిక బస్సులో ప్రయాణిస్తుంటుంది. ఆమె పక్కసీట్లో ఓ వ్యక్తి ఈలవేస్తూ బాలికను టీజ్ చేస్తున్నాడు. ఇది గమనించిన ఓ మహిళ... తను దిగాల్సిన స్టేజి వచ్చినప్పటికీ తన ప్రయత్నాన్ని విరమించుకుని బాలిక పక్కనే కూర్చుంటుంది. దాంతో ఆ బాలికకు మనోధైర్యం వస్తుంది. చూడండి ఈ వీడియో...