శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (13:35 IST)

ఫేస్ బుక్ ఫ్రెండ్, అర్థరాత్రి యువతి ఇంటికెళ్లాడు, కోర్కె తీరనందుకు రెండు ముక్కలుగా నరికాడు

image
ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని ఓ యువతికి దగ్గరయ్యాడు ఓ యువకుడు. అదే ఆసరా చేసుకుని అర్థరాత్రి ఆమె ఇంటికి వెళ్లాడు. తన కోర్కె తీర్చాలని అడిగాడు. అందుకు ఆమె అంగీకరించింది కానీ... ఆమెలో తేడా వుందని పదునైన ఆయుధంతో యువతిని రెండు ముక్కలుగా నరికి హత్య చేసాడు.

 
పూర్తి వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్. ఇండోర్‌లోని ఖజ్రానా పోలీస్ స్టేషన్ పరిధిలో మోహిసిన్ అలియాస్ జోయా కిన్నార్‌ అనే యువతి హత్యకు గురైంది. ఆమె మృతదేహాన్ని కిరాతకంగా రెండు ముక్కలుగా చేసి బైపాస్‌లోని టేబుల్‌లాక్స్‌లో ఒక ముక్కను విసిరారు. మిగిలిన సగం మృతదేహాన్ని ఇంటి పెట్టెలో దాచారు, దానిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, ఇప్పుడు పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.

 
ఖజ్రానా పోలీస్ స్టేషన్ ఏరియా.. సోమవారం ఉదయం పోలీసులు ఓ యువతి సగం మృతదేహం... నడుము నుంచి కింద భాగం బైపాస్ రోడ్డు పక్కన పడి వుండటాన్ని చూసి స్థానికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ యువతి మృతదేహం పైభాగం లేకపోవడంతో మృతురాలు ఎవరోనన్నది గుర్తించలేకపోయారు.

 
ఐతే ఆ ప్రాంతంలో నివాసముండే నూర్ మహ్మద్ అనే యువకుడు కనిపించకుండా పోవడంతో అతడి కోసం గాలించారు. చివరికి అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. అంతే... మొత్తం సంఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు నూర్ మహ్మద్ తన భార్య గర్భవతిగా వుండటంతో ఆమెను పుట్టింటిలో వదిలివచ్చాడు. ఈ క్రమంలో ఖాళీగా జులాయిగా తిరిగే నూర్... ఫేస్‌బుక్ ద్వారా జోయా కిన్నర్‌ను బుట్టలో పడేసాడు.

 
ఆమెకి మాయమాటలు చెప్పాడు. ఇంటికి వస్తున్నానంటూ యువతి జోయా కిన్నర్‌ వద్దకు అర్థరాత్రి వెళ్లాడు. ఐతే తన కోర్కె తీర్చాలని ఆమెను కోరాడు. అందుకు ఆమె కూడా సరేనంది. ఈ క్రమంలో ఆమె నపుంసకురాలని తెలుసుకున్నాడు. తనతో స్నేహం ఎందుకు చేసావంటూ కోపంతో నూర్ మహ్మద్ జోయా కిన్నార్‌తో తీవ్ర వాగ్వాదం చేసాడు. చివరికి గొంతుకోసి చంపేసాడు. ఆ తర్వాత మృతదేహాన్ని పారవేసేందుకు పదునైన ఆయుధంతో ఆమె మృతదేహాన్ని రెండు ముక్కలు చేసి బైపాస్‌పై విసిరాడు.

 
మృతదేహంలోని ఇతర భాగాన్ని కూడా పారవేయాలనుకున్నాడు, కాని పోలీసులు అతని కోసం వెతుకుతున్నారని తెలియడంతో, అతను మిగిలిన భాగాన్ని ఇంట్లోని బెడ్ బాక్స్‌లో దాచిపెట్టాడు. నిందితుడిని పోలీసులు పట్టుకోవడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. జోయా మృతదేహంలోని మరో భాగాన్ని కూడా ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు.