శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (21:24 IST)

బంగ్లాదేశ్‌లో పడవ మునక .. 23 మంది జలసమాధి

Boat Capsizes
బంగ్లాదేశ్‌లో ఆదివారం ఘోరం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న పడవ ఒకటి నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది జల సమాధి అయ్యారు. మరికొంతమంది గల్లంతయ్యారు. 
 
దీనిపై సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. అయితే, ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని ఉత్తర పంచగఢ్‌ జిల్లా పాలనాధికారి జహరుల్‌ ఇస్లాం తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. 
 
ఇదిలావుంటే, బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో పడవ ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వందల్లో ఉంది. అయితే, ఈ దేశంలో నడుపుతున్న పడవ యజమానులు సరైన భద్రతా చర్యలు పాటించక పోవడం వల్లే ఇవి జరుగుతున్నట్టు సమాచారం. కాగా, గత మే నెలలో కూడా పద్మ నదిలో స్పీడ్‌బోట్‌ ఇసుక లోడ్‌తో ఉన్న బల్క్‌ క్యారియర్‌ను ఢీకొట్టిన ఘటనలో 26 మంది మృతి చెందిన విషయం తెల్సిందే.