బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆరేళ్ళ పోరాటం.. అక్కడ అమ్మాయి.. ఇక్కడ అమ్మాయి.. డుం డుం డుం

girls marriage
ఆరేళ్ళ పోరాటం ఫలితంగా ఇద్దరు అమ్మాయిలు మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు మహిళ, బంగ్లాదేశ్ మహిళ ఈ వివాహం చేసుకున్నారు. తమిళనాడు బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం గత నెల 31వ తేదీన చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, తమిళనాడులోని మదురైకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం కెనడాలోని కల్గరీలో స్థిరపడింది. ఈయన కుమార్తె సుభిక్షకి బంగ్లాదేశ్‌లోని హిందూ కుటుంబానికి చెందిన టీనా దాస్‌కు మధ్య ఏర్పడిన ప్రచారం కాస్త ప్రేమగా మారింది. టీనా కుటుంబం కూడా కల్గరీలోనే ఉంటోంది. 
 
తనకు 19 యేళ్ల వయసున్నపుడే సుభిక్ష పెళ్ళిపై తన మనస్సులోని మాటను తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, అందుకు తల్లిదండ్రులు సమ్మతించలేదు. కానీ, తాను మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేయసాగింది. చివరకు ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించడంతో గత నెల 31వ తేదీన చెన్నైలో వీరిద్దరి వివాహం జరిగింది. 
 
ఈ పెళ్లి పక్కా బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం జరిగింది. సుభిక్ష, టీనా దాస్‌లు ఇద్దరూ తమతమ తల్లిదండ్రుల ఒడిలో కూర్చొన్నారు. ఆ తర్వాత దండలు మార్చుకున్నారు. పెళ్ళి చేసుకోవాలన్నది తమ కల అని నెరవేరుతుందని తాము కలలో కూడా ఊహించలేదని చెప్పారు. 35 యేళ్ల టీనా ఓ లెస్బియన్. ఓ వ్యక్తిని పెళ్లి చేసుకున్న నాలుగేళ్ల తర్వాత ఆ బంధం నుంచి బయటకు వచ్చింది. టీనా కల్గరీలోని ఫుట్‌హిల్స్ మెడికల్ సెంటరులో పేషెంట్ కేర్ సెంటరులో పని చేస్తున్నారు.