గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (17:25 IST)

ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా.. ఆ అందాల భామ వుండాల్సిందే..

Wazhma Ayoubi
Wazhma Ayoubi
ఆసియాకప్‌లో భాగంగా ఆప్ఘనిస్థాన్ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తోంది. లీగ్‌ దశలో శ్రీలంక, బంగ్లాదేశ్‌పై సంచలన విజయాలు నమోదు చేసిన ఆప్ఘనిస్థాన్ సూపర్‌-4కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.
 
ఈ విషయం పక్కనబెడితే.. ఆప్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు ఒక అందమైన యువతి హాజరైంది. ఆమె అందానికి ఆరోజు స్టేడియానికి వచ్చిన వారితో పాటు టీవీల్లో మ్యాచ్‌ చూసినవారు కూడా ఫిదా అయ్యారు.
 
అంతగా కుర్రకారు మనసులు దోచుకున్న ఆ యువతి పేరు వాజ్మా అయూబీ. ఆప్ఘన్‌ అభిమాని అయిన వాజ్మా బౌండరీ లైన్‌ వద్ద అఫ్గాన్‌ జెండా పట్టుకొని ఆటగాళ్లతో పాటు వీక్షకులను తన అందరంతో కట్టిపడేసింది. 
 
కాగా మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఆప్ఘనిస్తాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. కంగ్రాట్స్‌ బ్లూ టైగర్స్‌ అంటూ వాజ్మా ఆయూబీ తన ట్విటర్‌లో పేర్కొంది. అంతే ఆమె ఫోటో క్షణాల్లో వైరల్‌గా మారింది.
 
ఇది చూసిన కొంతమంది టీమిండియా అభిమానులు కూడా వాస్మా ఆయూబీ అందానికి ముగ్దులై.. ''టీమిండియా, ఆప్ఘనిస్తాన్‌ మ్యాచ్‌కు కూడా వస్తారా..'' అంటూ కామెంట్‌ చేయడం విశేషం.