ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (10:01 IST)

ఉచితాలు ఇంకెంతకాలం... ఉపాధి కల్పించలేరా? సుప్రీంకోర్టు ప్రశ్న

supreme court
దేశంలోని ప్రజలకు ఉచితాలు ఇంకెంత కాలం ఇస్తుంటారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఉచితాల స్థానంలో ఉపాధి కల్పించలేరా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రశ్న సంధించింది. గత 2013 జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం 81 కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నట్టు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 
 
దీనిపై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అంటే కేవలం పన్ను చెల్లింపుదారులే ఇక మిగిలివున్నారని (ఉచిత రేషన్ తీసుకోని వారు అనే ఉద్దేశంలో) వ్యాఖ్యానించింది. 
 
కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులపై దాఖలైన పిటిషన్‌ మీది విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టించడం, సామర్థ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా నొక్క చెప్పింది.