ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి
రైలు ఏసీ బోగీల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను నెలకు ఒకసారైనా ఉతుకుతారని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుడు కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు మంత్రి పైవిధంగా సమాధానిమిచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా ఉతకవచ్చని మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణికుల సౌకర్య, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా మంత్రి సభకు తెలిపారు.
రైళ్లలో ప్రయాణించే అనేక మంది ప్రయాణికులకు తరచుగా ఇదే సమస్య ఎదురవుతుంది. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంటులో ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం చెప్పడం కూడా అనేక మందిని ఆకర్షించింది. ఈ సమాధానం చూసిన అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది బెడ్ షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని అంటుండగా, మరికొంత మంది మాత్రం నెలకు రెండు సార్లు వాష్ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొంత మంది కామెంట్లు చేయడం విశేషం.