గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 27 ఏప్రియల్ 2019 (15:11 IST)

మమతకు ఓటేయలేదని.. భార్య నోట్లో యాసిడ్ పోసిన భర్త..!

పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత మమత బెనర్జీకి చెందిన అభ్యర్థికి ఓటేయలేదని భార్య నోట్లో యాసిడ్ పోశాడో కిరాతకుడు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారపక్షంగా పాలన చేస్తోంది. ఈ పార్టీకి మమత బెనర్జీ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 11వ తేదీ పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు జరిగాయి.
 
ఈ ఎన్నికల్లో ముషీరాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తృణమూల్ కార్యకర్తగా, దీదీకి వీరాభిమానిగా వున్నాడు. ఇతడు ఎన్నికల్లో తన భార్య దీదీ పార్టీకి ఓటేయలేదని తెలుసుకుని కోపంతో ఊగిపోయాడు. మమత పార్టీకి ఓటేయమని ఎన్నిసార్లు చెప్పినా ఆమె పట్టించుకోకపోవడంతో ఆవేశంతో భార్యపై దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా నోట్లో యాసిడ్ పోశాడు. 
 
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు బాధితురాలి కుమార్తె ఇచ్చిన వాంగ్మూలంతో పోలీసులు తృణమూల్ కార్యకర్తను అరెస్ట్ చేశారు. ఇంకా యాసిడ్ బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.