శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (13:20 IST)

పెళ్లయ్యాక 5 విషయాలు మాత్రం వారితో చెప్పొద్దు..?

సాధారణంగా చాలామంది స్త్రీలు తనకు భర్తగా రాబోయే అబ్బాయితో అన్ని విషయాలు చెప్పాలనుకుంటారు. చెప్పొచ్చు అందులో తప్పేమి లేదు.. అందుకుని అన్నీ విషయాలు చెప్పాల్సిసిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా 5 విషయాలు మాత్రం పెళ్లయ్యాక మీ భాగస్వామితో చెప్పుకోవడం అంత మంచిదికాదని నిపుణులు సూచిస్తున్నారు. మరి అవేంటో చూద్దాం..
 
1. అత్తాగారింట్లో మరదలితో లేదా మరిదితో తగాదాలు రావొచ్చ. అప్పుడప్పుడు మీ అత్తమామలతో కూడా సమస్యలు జరుగుతూ వుండవచ్చు. అయినా సరే.. వారి పద్ధతి మీకు నచ్చలేదని మీ భాగస్వామితో నిర్మొహమాటంగా చెబితే ఇంకేమైనా ఉందా.. మీమీద అతనికి దురభిప్రాయం కలుగుతుంది. అందువలన ఇలాంటి విషయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. 
 
2. అత్తవారింటికి వచ్చే చుట్టాల ప్రవర్తన మీకు అప్పుడప్పుడు నచ్చకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో మీ భాగస్వామి వద్ద వారిని తూలనాడే ప్రోగ్రామ్ పెట్టవద్దు. ఇలా చేస్తే అతనికి మరింత అసహనం పెరిగిపోతుంది. అలా కాకుండా.. ఏదో జోక్ చెబుతున్నట్టు చెప్పి.. నవ్వుతూ అసలు విషయం తన చెవిన పడేలా చేస్తే సరిపోతుంది.
 
3. పుట్టింటివారు మీ పెళ్లికోసం ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టి ఉండొచ్చు. అయితే అదే విషయాన్ని పదేపదే మీవారి వద్ద చెబితే.. తనకు మీమీద దురభిప్రాయం తప్పకుండా కలుగుతుంది. ఊరికే దెప్పిపొడవడానికి పెళ్ళి ఖర్చులను ఒక సాకుగా చెప్తుందని కూడా వారు అనుకోవచ్చును.
 
4. పెళ్లైన తరువాత పదేపదే గత జీవితంలో జరిగిన చెడు అనుభవాలను గుర్తుతెచ్చుకుని బాధపడడం అనవసరం. అలాంటిది.. అవే విషయాలను పదేపదే భాగస్వామి వద్ద ఏకరపు పెడితే బాగుండదు. రెండుసార్లు తను అర్థం చేసుకున్నా.. మళ్ళీ మళ్ళీ అవే విషయాలను మీరు ప్రస్తావిస్తే తను అసౌకర్యంతో పాటు అసహానాన్ని కూడా పొందే అవకాశం ఉంది. 
 
5. మీరు స్నేహితులుగా ఉండి.. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నా సరే.. కొన్ని విషయాలను మాత్రం మీ భర్తతో పంచుకోవడం అనవసరం. ముఖ్యంగా మీరు గతంలో డేటింగ్ చేసిన వ్యక్తుల గురించి లేదా మీరు ప్రేమించి ఆ తర్వాత తెగదెంపులు చేసుకున్న వ్యక్తులను గురించి కానీ వారికి పదేపదే చెప్పాల్సిన పనిలేదు. పెళ్లయ్యాక వాటి ఆలోచనలనే మీ దరిచేరకుండా చూసుకోండి.