సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:25 IST)

భార్యను ప్రేమికుడికిచ్చి పెళ్లి చేసాడు.. మరి కొడుకును ఏం చేసాడో తెలుసా!

ఇటీవలకాలంలో భార్య మీద అనుమానం వస్తేనో లేదా భార్య వేరే మగాళ్లను ఇష్టపడితేనో భర్తలు ఆ మహిళలను కడతేర్చడం వంటి సంఘటనలు చూస్తున్నాం. కానీ తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన వీటికి విరుద్ధంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే... బీహార్‌ రాష్ట్రంలోని భాగల్పూర్‌లో చోటు చేసుకున్న ఈ సంఘటనలో ఒక వ్యక్తి తన కట్టుకున్న భార్యకు ఆమె ప్రేమించిన వ్యక్తినిచ్చి వివాహం జరిపించాడు. అంతటితో ఆగకుండా తమకు ఉన్న రెండున్నరేళ్ల కుమారుడిని తన భార్యకు పెళ్లి కానుకగా ఇచ్చాడు.
 
ఖిరీబాఘ్ పంచాయతీ పరిధిలోని సాలెపూర్ గ్రామంలో ఓ అద్దె ఇంట్లో భార్య, రెండున్నరేళ్ల కుమారుడితో కలిసి ఓ వ్యక్తి నివసిస్తున్నాడు. అయితే ఏదో కేసు విషయంగా అతను అరెస్టు అయ్యి జైలుకు వెళ్లాడు. ఈ సమయంలో అతని భార్యకు ఆ ఇంటి యజమాని కొడుకు మోనుతో పరిచయమై, వారి మధ్య ప్రేమ చిగురించింది. 
 
ఇంతలో ఆమె భర్త జైలు నుంచి విడుదలయ్యాడు. ఇంటికి వచ్చాక అతనికి తన భార్య వేరొకరితో ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. దీంతో భార్యకు ఆ వ్యక్తితో వివాహం జరిపించాలని నిర్ణయించుకున్న అతను ఒక మంచి ముహూర్తం చూసి వారిద్దరికీ వివాహం జరిపించాడు. ఈ వేడుకకు పలువురు పెద్దలు సాక్ష్యంగా నిలిచారు. అలాగే, తన రెండున్నరేళ్ళ బిడ్డను కూడా భార్యకు కానుకగా ఇచ్చి.. తాను మాత్రం ఒంటరిగా మిగిలిపోయాడు.