గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 ఆగస్టు 2017 (11:18 IST)

అక్రమ సంబంధం : భార్య ముఖం చెక్కేశాడు.. చేతులు కట్ చేశాడు.. భర్త కూడా...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ అనుమానించిన భర్త అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాల

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అగ్రాలో దారుణం జరిగింది. అనుమానం పెనుభూతమైంది. భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనీ అనుమానించిన భర్త అత్యంత కర్కశంగా ప్రవర్తించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ఆగ్రా నగరంలోని పశ్చిమ ప్రతాప్‌నగర్‌కు చెందిన అనితా సింగ్ జూనియర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం అనితా ఇంద్రరాజ్ అనే యువకుడిని పెళ్లాడారు. వారు పశ్చిమ ప్రతాప్ నగర్‌లో అద్దె ఇంట్లో నివశిస్తున్నారు. 
 
భర్త ఇంద్రరాజ్ ఓ కోచింగ్ సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే, తన భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానించాడు. ఇదే విషయంపై వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. 
 
దీంతో ఆగ్రహంతో కత్తితో ఆమె ముఖం, చేతులపై పొడిచి చంపాడు. ఆపై ఇంద్రరాజ్ వేగంగా వెళుతున్న రైలు నుంచి నర్హోలీ రైల్వే బ్రిడ్జి వద్ద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు భార్యాభర్తల శవాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసులు దర్యాప్తు చేస్తున్నారు.