గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 24 అక్టోబరు 2017 (14:48 IST)

రహదారే రన్‌వేగా... ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై యుద్ధ విమానాల చక్కర్లు

అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేందుకుగాను ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో రహదారులను పలు దేశాలు నిర్మిస్తుంటాయి. ఈ తరహా రహదారులు అధికంగా న్యూజిలాండ్‌లో ఉన్నాయి.

అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించేందుకుగాను ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో రహదారులను పలు దేశాలు నిర్మిస్తుంటాయి. ఈ తరహా రహదారులు అధికంగా న్యూజిలాండ్‌లో ఉన్నాయి. అలాంటి రహదారి మన దేశంలోనూ ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నుంచి ఆగ్రా వరకు నిర్మించిన ఎక్స్‌ప్రెస్ హైవే ఇది. ఈ రహదారిపై భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు మంగళవారం చక్కర్లు కొట్టాయి. 
 
లక్నోకు 65 కిలోమీటర్ల దూరంలోని ఉన్నాం జిల్లా బంగార్‌మౌ వద్ద అద్భుత విన్యాసాలను చేపట్టింది. ఐఏఎఫ్ డ్రిల్స్‌లో భాగంగా ఈ విన్యాసాలను నిర్వహించారు. దేశంలోనే అత్యంత పొడవైన రహదారిగా గుర్తింపు పొందిన ఈ హైవేపై ఏకంగా 16 యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఈ విన్యాసాల్లో భాగంగా 35 టన్నుల సి-130 సూపర్‌ హెర్క్యులెస్‌ విమానం కూడా ఉంది. గరుడ్‌ కమాండోలను సంక్షోభ ప్రాంతాలకు తరలించే విన్యాసాల్లో భాగంగా ఈ భారీ విమానం ల్యాండ్‌ అయ్యింది. 
 
మరో 15 ఫైటర్‌ జెట్‌లు ఇక్కడ ల్యాండ్‌ అయ్యాయి. సుమారుగా 3 గంటల పాటు ఈ విన్యాసాలను నిర్వహించారు. నిమిషాల వ్యవధిలోనే యుద్ధ విమానాలు ల్యాండ్‌ అయిన తర్వాత మళ్లీ గాల్లోకి ఎగిరాయి. అత్యవసర సమయాల్లో విమానాశ్రయాలపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ విన్యాసాలు నిర్వహించారు.