శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2020 (11:11 IST)

వాస‌న గుణం కోల్పోతే.. అది క‌చ్చితంగా క‌రోనానే

క‌రోనా వైర‌స్ ల‌క్ష‌ణాల గురించి యూనివ‌ర్సిటీ కాలేజ్ లండ‌న్ (యూసీఎల్‌) కొత్త నివేదిక‌ను రిలీజ్ చేసింది. ఆ వ‌ర్సిటీ ప‌రిశోధ ప్రకారం.. క‌రోనా సోకిన వారు వాస‌న గుర్తించ‌డం క‌ష్ట‌మే.

అయితే క‌రోనా వ‌ల్ల క‌లిగే ద‌గ్గు, జ్వ‌రం ల‌క్ష‌ణాల‌ క‌న్నా.. వాస‌న గుణం కోల్పోతే అప్పుడు క‌చ్చితంగా క‌రోనా వైర‌స్ సంక్ర‌మించిన‌ట్లు భావించ‌వ‌చ్చు అని యూసీఎల్ త‌న రిపోర్ట్‌లో పేర్కొన్న‌ది.

సుమారు 590 మందిపై జ‌రిపిన‌ ప‌రీక్ష‌ల ద్వారా ప‌రిశోధ‌కులు ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. దాంట్లో 80 శాతం మంది వాస‌న గుణాన్ని కోల్పోయిన‌ట్లు చెప్పారు. కేవ‌లం స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిపైనే ఈ ప‌రిశోధ‌న చేప‌ట్టారు.

ముక్కు, గొంతు, నాలుక వెనుభాగంలో ఉన్న క‌ణాల‌ను వైర‌స్ ప‌ట్ట‌డం వ‌ల్ల రోగులు వాస‌న గుణాన్ని కోల్పోతున్న‌ట్లు ప‌రిశోధ‌కులు తేల్చారు.  ప్ర‌స్తుత త‌రుణంలో వాస‌న‌, రుచి కోల్పోయిన వారు కోవిడ్ ప‌రీక్ష చేయించుకోవ‌డం ఉత్త‌మం.