పురందేశ్వరికి కరోనా

purandheswari
ఎం| Last Updated: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (09:15 IST)
బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ అని తేలింది.
కరోనా లక్షణాలతో బాధపడుతున్న పురందేశ్వరి
హైదరాబాద్‍లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆమెకు ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవి లభించింది. ఇంతలోనే ఆమెకు కరోనా సోకడంతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

మహారాష్ట్ర మంత్రికి..
మహారాష్ట్రలో మరో మంత్రి ఉదయ్ సామంత్ కరోనా బారిన పడ్డారు. ‘‘నాకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడవడంతో హోంక్వారంటైన్ లో ఉన్నాను’’ అంటూ మంత్రి ఉదయ్ సామంత్ ట్వీట్ చేశారు. తనకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలిందని మంత్రి ఉదయ్ చెప్పారు.

తన ఆరోగ్యం బాగానే ఉందని హోంక్వారంటైన్ లో ఉన్నానని మంత్రి చెప్పారు. కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదైన మహారాష్ట్రలో 12 మంది రాష్ట్ర మంత్రులు కరోనా బారిన పడ్డారు.దీనిపై మరింత చదవండి :