మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (12:27 IST)

పాట్నా రైల్వే స్టేషన్ టీవీల తెరపై నీలి చిత్రాల ప్రదర్శన

bhagalpur railway station
బీహార్ రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లలలో ఉన్న టీవీలపై నీలి చిత్రాలు అపుడపుడూ దర్శనమిస్తున్నాయి. తాజాగా భాగల్‌పూర్ పట్టణ రైల్వే స్టేషన్‌లోని టీవీ తెరపై సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నఫళంగా నీలి చిత్రాలు ప్రత్యక్షమయ్యాయి. వీటిని చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. 5 నుంచి 10 నిమిషాలు ప్రసారమైన ఆ సమాచారాన్ని కొంతమంది తమ సెల్‍‌ఫోన్లలో చిత్రీకరించగా, మరికొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది టీవీ ప్రసారాలను నిలిపివేశారు. 
 
కాగా, గత మార్చి నెలలో కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని రైల్వే స్టేషన్‌లో ఏకంగా మూడు నిమిషాల పాటు నీలి చిత్రాలు ప్రదర్శితమైంది. ఈ ఉదంతం మరవకముందే భాగల్‌పూర్‌లో మరో అపశ్రుతి చోటుచేసుకోవడం గమనార్హం. ఈ విషయంపై సబ్ డివిజనల్ అధికారి ధనంజయ కుమార్, డీఎస్పీ అజయ్ కుమార్ చౌదరిలు స్పందించి, ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.