1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఆగస్టు 2022 (22:28 IST)

దేశంలోనే తొలిసారి డబుల్ డెక్కర్ ఈవీ బస్సు... ఎక్కడ?

double ev bus
మన దేశంలోనే తొలిసారి డబుల్ డెక్కర్ ఈవీ బస్సు అందుబాటులోకి వచ్చింది. ఈ డబుల్ డెక్కర్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సును కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ముంబైలో ఆవిష్కరించారు. 
 
ఎలక్ట్రిక్ కార్ల విస్తరణకు కేంద్రం చేస్తున్న కృషి చేస్తుండగా ప్రతిస్పందనగా బస్సు డీజిల్‌తోకాకుండా విద్యుత్‌తో నడుస్తుంది. సెప్టెంబర్ నుండి, స్విచ్ ఈఐవీ 22 డబుల్ డెక్కర్ బస్సు సేవలను ప్రారంభించనుంది. 
 
స్విచ్ ఈఐవీ 22 భారతదేశంలో రూపొందించారు. ఇది 'ఆత్మనిర్భర్ భారత్‌'కు గణనీయమైన ప్రోత్సాహం. స్విట్చ్ ఈఐవీ 22 అత్యంత అధునాతన సాంకేతికత, అత్యాధునిక డిజైన్, అత్యున్నత స్థాయి భద్రత, అంతిమ సౌలభ్యం లక్షణాలను కలిగి ఉన్నట్లు నివేదించబడింది.
 
ముంబైకి 200 ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల కోసం ఆర్డర్ అందుకున్న తర్వాత దేశంలోని కీలక ప్రాంతాలలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ విభాగంలో సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవాలని స్విచ్ ఇండియా భావిస్తోంది.