జింబాబ్వేతో తొలి వన్డే : భారత్ బ్యాటింగ్
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు గురువారం తొలి వన్డే మ్యాచ్ ఆడనుంది. మొత్తం మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో గురువారం తొలి వన్డే జరుగనుంది. హరారే వేదికగా జరిగే ఈ వన్డేలో భారత జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో బౌలింగ్‌కు తొలుత మొగ్గు చూపినట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపారు.
దీంతో జింబాబ్వే జట్టు బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లుగా మరుమని, ఇన్నోసెంట్ కైయా బరిలోకి దిగారు. తొలి ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. తొలి ఓవర్‌లో 6 పరుగులు వచ్చాయి. కైయా ఒక పరుగు చేయగా, మిగిలిన 5 రన్స్ లెగ్ బైస్ రూపంలో వచ్చాయి. ప్రస్తుతం తొలి 15 ఓవర్లు ముగిసే సమయానికి జింబాబ్వే జట్టు ఐదు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది.
మరోవైపు, ఈ వన్డే కోసం ప్రకటించిన భారత జట్టులో ధావన్, గిల్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్సర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు ఉన్నారు.