1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 ఆగస్టు 2022 (14:04 IST)

హరారేలో వన్డే సిరీస్.. కెప్టెన్సీపై ఫైర్ అయిన మహ్మద్ కైఫ్

klrahul
జింబాబ్వేతో రేపటి నుంచి హరారేలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ శిఖర్ ధావన్ జట్టును నడిపించనున్నట్టు తొలుత సెలక్టర్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్ కరోనా బారినపడడంతో తొలుత అతడిని జట్టులోకి ఎంపిక చేయలేదు. అయితే, ఆ తర్వాత కరోనా నుంచి కోలుకుని ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో తిరిగి జట్టులోకి వచ్చాడు. 
 
అంతేకాదు, తొలుత ధావన్‌కు కెప్టెన్సీని కట్టబెట్టిన సెలక్టర్లు ఇప్పుడు అతడిని తప్పించి రాహుల్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. దీనిపై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. ఇది సరైన పద్ధతి కాదని సెలక్టర్లపై విమర్శలు గుప్పించాడు.