సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2020 (11:30 IST)

లడఖ్‌కు చేరుకున్న ఆర్మీ చీఫ్... సరిహద్దు భద్రతపై క్షేత్రస్థాయి చర్చ!!

భారత్, చైనా దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొనివున్నాయి. దీంతో ఇరు దేశాల సరిహద్దుల మధ్య గతంలో ఎన్నడూ లేనంతగా టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా, పీపుల్స్ ఆర్మీ బలగాలు దుస్సాహసానికి పాల్పడుతుండటం, వీటిని భారత సైనికులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి. ఈ చర్యను చైనా ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నవరాణే గురువారం సరిహద్దు ప్రాంతమైన లడఖ్‌కు చేరుకున్నారు. 
 
సరిహద్దుల్లోని ప్రస్తుత పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహంపై అధికారులతో క్షేత్ర స్థాయిలో చర్చించనున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సుపై భారత్ దాదాపు పట్టు సాధించడంతో చైనా బిత్తరపోయింది. భారత సైన్యం పాంగాంగ్‌లోని వ్యూహాత్మక శిఖరాలపై స్థావరాలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ వ్యవహారంపై కూడా ఆర్మీ చీఫ్ చర్చించనున్నారు. వీటితో పాటు ఎల్ఏసీ వెంట ఉన్న ప్రస్తుత పరిస్థితిని కూడా క్షేత్ర స్థాయిలో ఉన్న కమాండర్లు చీఫ్ నరవాణేకి వివరించనున్నారు. 
 
కాగా, రెండు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ఆర్మీ అధిపతికి సీనియ‌ర్ ఫీల్డ్ క‌మాండ‌ర్లు.. స‌రిహ‌ద్దు ప‌రిస్థితిపై ఆయ‌న‌కు వివ‌రించ‌నున్నారు. వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఉన్న ఉద్రిక్త‌త‌ల గురించి ఆర్మీ చీఫ్ తెలుసుకోనున్నారు. ద‌ళాలు ఎంత వ‌ర‌కు స‌మాయ‌త్తంగా ఉన్నాయో ఆర్మీ చీఫ్‌కు విశ్లేషించ‌నున్నారు.