ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (11:45 IST)

తూర్పు సిక్కింలో హిమపాతం.. చిక్కుకున్న 500 మంది పర్యాటకులు

Sikkim
Sikkim
ఫిబ్రవరి 21న తూర్పు సిక్కింలోని నాటులా వద్ద అకస్మాత్తుగా భారీ హిమపాతం కారణంగా 500 మందికి పైగా పర్యాటకులతో సుమారు 175 వాహనాలు చిక్కుకుపోయాయి. గాంగ్‌టక్ (తూర్పు సిక్కిం)లో హిమపాతం, ప్రతికూల వాతావరణం కారణంగా చిక్కుకుపోయిన 500 మంది పర్యాటకులను భారత సైన్యానికి చెందిన త్రిశక్తి కార్ప్స్‌కు చెందిన దళాలు రక్షించాయని భారత సైన్యం బుధవారం తెలిపింది. 
 
పర్యాటకులను రక్షించిన వెంటనే వారికి తక్షణ వైద్య సంరక్షణ, వేడి రిఫ్రెష్‌మెంట్‌లు, భోజనం,  సురక్షితమైన రవాణా సకాలంలో అందించడం జరిగింది. పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారని సైన్యం వెల్లడించింది. 
 
త్రిశక్తి కార్ప్స్, భారత సైన్యం సిక్కింలో సరిహద్దులను కాపాడుతూ, పౌరులు, ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని సైన్యం పేర్కొంది.