సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 జనవరి 2024 (09:51 IST)

రామాలయం.. పర్యాటకుల తాకిడి.. యూపీకి భారీ ఆదాయం

ram mandir
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, సోమవారం నాడు అయోధ్యలో రామమందిరాన్ని అధికారికంగా ప్రారంభించిన తర్వాత, పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రానికి పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందనే అంచనా మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన రామాలయం-పర్యాటక కార్యక్రమాల వల్ల 2025 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అదనంగా రూ. 25,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. రామాలయం ప్రారంభోత్సవం వల్ల రాష్ట్రానికి ఏటా గణనీయమైన సంఖ్యలో పర్యాటకులు వస్తారని జెఫరీస్ నివేదిక సూచిస్తుంది.
 
ఫలితంగా అయోధ్య గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం వుందని తెలుస్తోంది. వ్యాపార కేంద్రాల సంఖ్య పెరిగే ఛాన్సుందని ఆర్థిక పండితులు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆధ్యాత్మిక సంస్థలు, పర్యాటక ప్రదేశాలతో పోల్చి చూస్తే, అయోధ్యను సందర్శిస్తున్న పర్యాటకుల సంఖ్య అత్యధిక సంఖ్యలో వుంటుందని అంచనా వేయడం జరిగింది.