1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జనవరి 2024 (15:04 IST)

నరేంద్ర మోదీ జోకర్.. మాల్దీవుల మంత్రి కామెంట్స్‌పై రచ్చ రచ్చ

Modi Lakshadweep tour
ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రి చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగుతోంది. ఇటీవల, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ భారతదేశంలోని మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు సమన్లు జారీ చేసింది. దీంతో ఆయన ఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సౌత్ బ్లాక్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రధాని మోదీ ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించారు. 
 
సామాజిక మాధ్యమాల ద్వారా లక్షద్వీప్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు వ్యంగ్యంగా స్పందించారు. మోదీని కీలుబొమ్మగా, జోకర్‌గా అభివర్ణించారు. భారత్‌పై కించపరిచే వ్యాఖ్యలు చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లు జారీ చేసింది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల అనుచిత వ్యాఖ్యలపై దుమారం రేగడంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల హైకమిషనర్ ఇబ్రహీం షహీబ్‌కు సమన్లు జారీ చేసింది.