శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (12:41 IST)

సిక్కిం రాష్ట్రానికి కష్టాలు తప్పట్లేదు..

floods
సిక్కిం రాష్ట్రానికి కష్టాలు తప్పట్లేదు. వరదలతో ఇప్పటికే రాష్ట్రం అతలాకుతలమైంది. తాజాగా సిక్కిం ప్రాంతంలో మరొక సరస్సు తెగిపోయే ప్రమాదం పొంచి వుంది. లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల కలిగే పరిణామాలు ఊహకు అందని విధంగా వున్నాయి. 
 
సిక్కిం చుట్టుపక్కల విధ్వంసకర దృశ్యం కనిపిస్తోంది. ఇళ్లు ధ్వంసం అయ్యాయి. వందలాది మంది గల్లంతయ్యారు. తాజాగా షాకో చో సరస్సు పగిలిపోతుందనే భయం  ఏర్పడింది. 
 
దీంతో అలెర్ట్ కూడా జారీ చేశారు. సరస్సు తెగితే గ్యాంగ్‌టక్, మంగన్ జిల్లా, పాక్యోంగ్ జిల్లాకు చెందిన రంగ్పో, గోలిటార్ ప్రాంతాలకు ముప్పు పొంచివుంది.