శుక్రవారం, 25 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 24 జులై 2025 (16:49 IST)

Kanchipuram: కాంచీపురం పట్టుచీరలకు ఫేమస్.. ఆలయాలకు ప్రసిద్ధి.. అలాంటిది ఆ విషయంలో?

Love
Love
మానవీయ విలువలు గంగలో కలిసిపోతున్నాయి. వివాహేతర సంబంధాల కోసం హత్యలు చేసేందుకైనా చాలామంది వెనుకాడట్లేదు. తాజాగా ఓ యాప్ విడుదల చేసిన డేటాలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్స్‌ట్రా మారిటల్ అఫైర్స్ కోసం తమ యాప్‌ను వాడే వారిలో తమిళనాడులోని కాంచీపురం టాప్‌లో వుందని తెలిపింది. 
 
గతేడాది ఈ ప్రాంతం 17వ స్థానంలో ఉండగా ఇప్పుడు టాప్‌లోకి వచ్చింది. రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో గుర్గావ్ నిలిచింది. ఆసక్తికరంగా ముంబై టాప్ 20లో కూడా చోటు దక్కించుకోలేదు. గతేడాది ముంబై టాప్ 2లో ఉంది. హైదరాబాద్  17 వ స్థానంలో నిలిచింది. 
 
ఓ అంతర్జాతీయ డేటింగ్ యాప్ ఈ డేటాను విడుదల చేసింది. కెనడాకు చెందిన ఈ ఆన్‌లైన్ డేటింగ్ వెబ్ సైట్ విడుదల చేసిన డేటా అందిరికీ షాకిచ్చింది. సర్వే చేసిన పెద్దలలో సగానికి పైగా వివాహేతర సంబంధాలను అంగీకరిస్తున్నారని ఈ డేటా వెల్లడించింది.