1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 24 జులై 2025 (16:12 IST)

జూన్2026 జూలై ఒకటో తేదీ నుంచి ఇంగ్లండ్ - భారత్ వన్డే క్రికెట్

lords cricket stadium
భారత్, ఇంగ్లండ్ క్రికెట్ల జట్ల మధ్య పరిమిత ఓవర్ల క్రికెట్ టోర్నీ జరుగనుంది. ఈ టూర్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విడుదల చేసింది. ఈ పర్యటనలో భారత్ ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ వైట్ బాల్ క్రికెట్ సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది. 2026 జూలై ఒకటో తేదీ నుంచి ఈ పర్యటన షురూకానుంది. 
 
ఈ టోర్నీలో భాగంగా, తొలి టీ20 జూలై 1 (డుర్హామ్), రెండో టీ20 జూలై 4 (మాంచెష్టర్),  మూడో టీ20 జూలై 7 (నాటింగ్ హామ్), నాలుగో టీ20 జూలై 9 (బ్రిస్టల్), ఐదో టీ20 జూలై 11 (సౌతాంఫ్టన్)ను నిర్వహిస్తారు. అలాగే, మూడు వన్డే సిరీస్‌లో భాగంగా, మొదటి వన్డే మ్యాచ్ జూలై 14న బర్మింగ్ హామ్, రెండో వన్డే మ్యాచ్ జూలై 16వ తేదీన కార్డిఫ్, మూడో  వన్డే జూలై 19వ తేదీన లార్డ్స్‌లో జరుగనుంది.