బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 జులై 2021 (19:00 IST)

రిక్షా వాలా కుమారుడు ఐఏఎస్ అయ్యాడు..

Rickshaw wala
ఓ రిక్షా నడుపుకునే వ్యక్తి కుమారుడు ఐఏఎస్ అయ్యాడు. తనను హేళన చేసిన వారి ముందు తలెత్తుకుని నిలబడ్డాడు. అతని పేరు గోవింద్ జైస్వాల్. రిక్షావాలా కొడుకు అనే పేరునుంచి జిల్లాకి కలెక్టర్ అనే పేరుకు చేరుకోవడానికి జై స్వాల్ పడిన కష్టం పదిమందికి స్ఫూర్తి వంతం. 
 
గోవింద్ జైస్వాల్ తండ్రి నారాయణ్ జైస్వాల్ ఒక గవర్నమెంట్ రేషన్ షాప్ లో పని చేస్తుండేవాడు.అతని సంపాదన మొత్తం ఇంట్లో వారి గురించే ఖర్చు చేసేవాడు. అయితే ఆ రేషన్ షాప్ అనుకోకుండా మూసివేశారు. దీంతో నారాయణ జైస్వాల్ ఉపాధి కోల్పోయాడు. 
 
అయితే అప్పటికే తన దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని రిక్షాలను కొన్నాడు. ఎవరైతే ఆ రిక్షాలను తీసుకుని అద్దె చెల్లిస్తారో వారికీ కిరాయికి ఇచ్చేవాడు. అలా వచ్చిన సొమ్ముని రూపాయి రూపాయి పోగుచేసి.. కొంత భూమిని కొన్నాడు.
 
అయితే నారాయణ జైస్వాల్ ను మళ్ళీ విధి వెక్కిరించింది. ఆయన భార్యకు తీవ్ర అనారోగ్యం చేసింది. వైద్య ఖర్చుల నిమిత్తం చేతిలో ఉన్న నగదును ఖర్చు చేశాడు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. నారాయణ్ జైస్వాల్ భార్య అనారోగ్యతో ,మరణించింది. దీంతో మళ్ళీ నారాయణ జై స్వాల్ జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం మొదలు పెట్టాడు. 
 
రిక్షాలను, దాచుకున్న భూమిని అమ్మేసి గోవింద్ జైస్వాల్.. ఆడపిల్లలకు పెళ్లి చేసాడు నారాయణ. అయితే కొడుకుని చదివించాలని నారాయణకు మంచి పట్టుదల. దీంతో తానే రిక్షా తొక్కడం మొదలు పెట్టాడు నారాయణ్ జైస్వాల్. అలా గోవింద్ ను చదివించడం మొదలు పెట్టాడు. పై చదువులు పూర్తి అయ్యాక గోవింద్ తాను కలెక్టర్ చదువుతా అని తండ్రితో చెప్పాడు. కొడుకు కోరిక తెలుసుకున్న నారాయణ సంతోషంతో అప్పటి వరకూ కొడుకు కోసం దాచిన 40000 రూపాయలను ఇచ్చి కోచింగ్‌కి పంపించాడు.
 
అలా కోచింగ్ కోసం ఢిల్లీ కి వెళ్లిన గోవింద్ జైస్వాల్ నెలవారీ ఖర్చుల కోసం అక్కడ చిన్న చిన్న పనులు చేస్తూ చదువుకునేవారు. అలా కష్టపడుతూ చదివి మొదటి సరిగా సివిల్స్ పరీక్షలు రాసాడు. 2006లో ఫలితాలు వెలువడిన తరువాత గోవింద్ జీవితంలో అది మరుపురాని రోజుగా మిగిలింది. గోవింద్ మొదటి ప్రయత్నంలోనే జాతీయ స్థాయి లో 48 వ ర్యాంక్‌ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా గోవాలో పనిచేస్తున్నారు.