సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2024 (14:27 IST)

ఐఐటీ బాంబే విద్యార్థుల నృత్య ప్రదర్శన.. నెట్టింట రచ్చ రచ్చ

Dance
Dance
ఐఐటీ బాంబే విద్యార్థుల నృత్య ప్రదర్శన చర్చకు దారితీస్తోంది. ఈ డ్యాన్స్ హద్దులు దాటింది. కాలేజీ ఈవెంట్ సందర్భంగా ఓ పాపులర్ సాంగ్‌కు స్టూడెంట్స్ డ్యాన్స్ చేశారు. ఈ డ్యాన్స్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఇంజినీరింగ్ సంస్థ అయిన ఐఐటీ బాంబేలోని హాస్టల్ స్టూడెంట్స్ ఈ నృత్యాన్ని ప్రదర్శించారు. సోషల్ మీడియాలో మిలియన్ల వీక్షణలను సంపాదించారు. 
 
ఈ వైరల్ వీడియోలో ఒక విద్యార్థి క్రాప్ టాప్, స్కర్ట్ ధరించి డ్యాన్స్‌ చేసింది. ఐఐటీ బాంబే విద్యార్థుల డ్యాన్స్‌పై చర్చ కొనసాగుతుండగా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీడియో వైరల్ అవుతోంది. విమర్శకులు ఐఐటీ బాంబే విద్యార్థుల నృత్యాన్ని "అసభ్యకరమైనది" అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.