చిదంబరంకు బెయిల్ మంజూరు.. అయినా కస్టడీలోనే...
కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ, ఆయన మరికొన్ని రోజులు కస్టడీలోనే గడపనున్నారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అరెస్టు అయి, తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నెల 24 వరకూ ఈడీ కస్టడీ కొనసాగనుంది. దాదాపు రెండు నెలల నుంచి ఆయన జైల్లో మగ్గుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్ మంజూరు అయినా, ఈడీ కస్టడీలో ఉన్నందున 24వ తేదీ వరకూ ఆయన విడుదల అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది.