ISRO : నమ్మశక్యం కాని డీ-డాకింగ్ సాధించిన SpaDeX ఉపగ్రహాలు.. ఇస్రో
స్పాడెక్స్ ఉపగ్రహాలను డీ-డాకింగ్ చేయడం ద్వారా చంద్రుడిని అన్వేషించడం, మానవ అంతరిక్షయానం, సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడం వంటి భవిష్యత్ మిషన్లకు మార్గం సుగమం చేసినట్లు ఇస్రో గురువారం తెలిపింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్ పోస్ట్‌లో ఉపగ్రహాల విజయవంతమైన డీ-డాకింగ్‌ను ప్రకటించారు.
"SpaDeX ఉపగ్రహాలు నమ్మశక్యం కాని డీ-డాకింగ్‌ను సాధించాయి. ఇది భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రయాన్ 4 అండ్ గగన్‌యాన్‌తో సహా ప్రతిష్టాత్మక భవిష్యత్ మిషన్‌లను సజావుగా నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తుంది" అని సింగ్ అన్నారు. "ఇస్రో బృందానికి అభినందనలు. ఇది ప్రతి భారతీయుడికి ధైర్యాన్నిస్తుంది.." అని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిరంతర ప్రోత్సాహం ఉత్సాహాన్ని పెంచుతుందన్నారు.
గత ఏడాది డిసెంబర్ 30న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్షంలో డాకింగ్ ప్రయోగాన్ని ప్రదర్శించడానికి SDX01, SDX02 అనే రెండు ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచినప్పుడు SpaDeX మిషన్ ప్రారంభించబడింది. అనేక ప్రయత్నాల తర్వాత, అంతరిక్ష సంస్థ జనవరి 16న రెండు ఉపగ్రహాలను విజయవంతంగా డాక్ చేసింది.