శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 2 జులై 2018 (13:16 IST)

ఇటలీ పర్యాటకురాలిపై టూరిస్ట్ గైడ్ అత్యాచారం.. కారులోనే నోరు కట్టేసి?

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇది చాలదన్నట్లు.. విదేశాల నుంచి వచ్చే మహిళలపై కూడా భారత్‌లో లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు ప

దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇది చాలదన్నట్లు.. విదేశాల నుంచి వచ్చే మహిళలపై కూడా భారత్‌లో లైంగిక దాడులు జరుగుతున్నాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం చోటుచేసుకుంది. భారత్‌కు పర్యాటకురాలిగా వచ్చిన 37 ఏళ్ల ఇటలీ మహిళా టూరిస్టుపై టూరిస్ట్ గైడ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. క్యాబ్‌లోనే ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జూన్ 14న జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటనపై బాధితురాలు ఢిల్లీకి వెళ్లి, ఇటలీ ఎంబసీ అధికారులను కలవడంతో పాటు.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నవంబరులో భారత్ వచ్చిన బాధితురాలు కొంతకాలం బెంగళూరులోనే వుంది. తర్వాత జూన్ 11న ముంబైకి వచ్చింది. ఈ క్రమంలో జూన్ 14న గేట్ వే ఆఫ్ ఇండియాను చూడ్డానికి వెళ్లింది. ఆ సమయంలో ఓ వ్యక్తి ఆమెను కలిసి, టూరిస్ట్ గైడ్‌గా పరిచయం చేసుకున్నాడు. 
 
అతడితో మాట్లాడాక కొంత మొత్తాన్ని బాధితురాలు అతనికిచ్చింది. ఆ రోజు సాయంత్రం టూర్ పూర్తయిన తర్వాత... బాలీవుడ్ యాక్టర్ల నివాసాలను చూపిస్తానని.. తీసుకెళ్లిన టూరిస్ట్ గైడ్ కారులోనే మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నోటిని కట్టేసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జుహు పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిపై సెక్షన్ 376 కింద రేప్ కేసు నమోదు చేశారు.