శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (13:51 IST)

హంజార్‌లో భారీ వరదలు : నలుగురి మృతి - 40 మంది గల్లంతు

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కిష్టావర్ సమీపంలోని హంజార్ అనే ఏరియాలో బుధవారం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి. ఈ వరదల ప్రభావంతో గ్రామంలోని చాలా గృహాలు కొట్టుకునిపోయాయి. ఈ వరదల కారణంగా నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 40 మంది వరకు గల్లంతయ్యారు. 
 
ఈ వరదల కారణంగా అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని కిష్టావర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ అశోక్‌ కుమార్‌ తెలిపారు. శిథిలాల నుంచి ఇప్పటివరకు నాలుగు మృతదేహాలను వెళికితీశామని చెప్పారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, భారత వాయు సేన కూడా ఈ సహాయక చర్యల్లో పాలుపంచుకుంటుందని వెల్లడించారు.
 
కాగా, ఈ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో అతి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతారణ శాఖ హెచ్చరించింది. నదుల్లో నీటి ప్రవాహం పెరగనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు సూచించారు.