గురువారం, 13 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2016 (12:46 IST)

జయలలితను సింగపూర్‌కు తరలించే అవకాశం.. అపోలోకు రాహుల్ గాంధీ

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్య సేవలను అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుంత ఆమెకు ఎయిమ్స్ వైద్యులతో పాటు... లండన్ నుంచి ప్రత్యేకంగ

అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు మెరుగైన వైద్య సేవలను అందించే నిమిత్తం సింగపూర్‌కు తరలించే అవకాశం ఉంది. ప్రస్తుంత ఆమెకు ఎయిమ్స్ వైద్యులతో పాటు... లండన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన వైద్య నిపుణుడు రిచర్డ్ బీలేలు వైద్యం అందిస్తున్నారు. 
 
అయితే, ఆమె ఆరోగ్యంలో కాస్తంత మెరుగుపడినప్పటికీ... పూర్తి స్థాయిలో కుదుటపడలేదు. దీంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సింగపూర్‌కు తరలించాలని భావిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం అపోలో ఆస్పత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. తమిళనాడు ప్రజలు 'అమ్మ'గా పిలుచుకునే జయలలిత... త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు పూజలు నిర్వహిస్తున్నారు. 
 
ఇదిలావుండగా ఇప్పటికే జయలలిత అనారోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న ఆపార్టీ కార్యకర్తలు ఆమెను సింగపూర్‌కు తరలిస్తారని వెలువడ్డ వార్తలతో మరింతో ఆందోళన చెందుతున్నారు. అమ్మ క్షేమంగా తిరిగి రావాలంటూ కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్నారు. దీంతో అపోలో ఆస్పత్రి సర్వమత ప్రార్థనా మందిరంగా మారిపోయింది.