శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 7 డిశెంబరు 2016 (13:10 IST)

ఐసీయూలో జయలలిత జోకులు... గుండెలవిసేలా ఏడ్చిన నర్సులు....

చూసేందుకు చాలా కఠినంగా ఉన్నట్లు కనిపించే అమ్మ జయలలితకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువేనని ఆమెకు వైద్యం చేసిన అపోలో వైద్యులు చెపుతున్నారు. ఆమెకు దగ్గరుండి వైద్యం చేసిన డాక్టర్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ... జయలలిత తనకు వైద్య సేవలు అందించే నర్సులతో చాలా సరదాగా జ

చూసేందుకు చాలా కఠినంగా ఉన్నట్లు కనిపించే అమ్మ జయలలితకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువేనని ఆమెకు వైద్యం చేసిన అపోలో వైద్యులు చెపుతున్నారు. ఆమెకు దగ్గరుండి వైద్యం చేసిన డాక్టర్ ప్రీతా రెడ్డి మాట్లాడుతూ... జయలలిత తనకు వైద్య సేవలు అందించే నర్సులతో చాలా సరదాగా జోకులు వేస్తూ ఉండేవారన్నారు. ఐసీయూలో క్రిటికల్ స్టేజిలో సైతం ఆమె నర్సులతో సరదాగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. 
 
ఐతే ఈమె ఆరోగ్య పరిస్థితి క్షీణించినపుడు ఆమెకు సేవలు చేసిన నర్సులంతా బోరుమని ఏడ్చారనీ, అమ్మ ప్రాణాలను నిలబెట్టాలని దేవుడిని ప్రార్థించారని వెల్లడించారు. ఏదేమైనప్పటికీ అమ్మను బతికించేందుకు వైద్యులంతా కలిసి తీవ్రంగా శ్రమించారని, ఒత్తిడికి గురయ్యేవారనీ ఆమె వెల్లడించారు. కానీ ఆమె తన ప్రాణాల కోసం చేసిన పోరాటంలో ఓడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెకు వైద్య చికిత్స అందించినవారంతా బోరుమని విలపించారని గుర్తు చేసుకున్నారు.