శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (13:02 IST)

జయలలితకు 'భారతరత్న'తో పాటు 'నోబెల్ శాంతి' పురస్కారం ఇవ్వాలి : అన్నాడీఎంకే

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నతోపాటు... నోబెల్ శాంతి, మెగాసెసే పురస్కారాలను ఇవ్వాలని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు దేశ అత్యున్నత పౌరపురస్కారమైన భారత రత్నతోపాటు... నోబెల్ శాంతి, మెగాసెసే పురస్కారాలను ఇవ్వాలని అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం ఓ తీర్మానం చేసింది. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గురువారం తొలిసారి జరిగింది. ఇందులో మొత్తం 14 తీర్మానాలను ఆమోదించారు. ఆమోదించిన తీర్మానాల్లో ముఖ్యమైనవి ఇవే... 
 
* ఇప్పటి దాకా ఉన్న నిబంధనలను మార్చి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ.
* పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం.
* జయలలితకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలి.
* పార్లమెంటులో జయలలిత కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి.
* జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నించాలి.
* జయలలిత పుట్టిన రోజును 'జాతీయ రైతు దినోత్సవం'గా ప్రకటించాలి. 
* జయలలిత విగ్రహాన్ని పార్లమెంట్ ప్రాంగణంలో పెట్టాలని తీర్మానించారు.