బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (17:03 IST)

జార్ఖండ్‌లో దారుణం.. బాలికపై అధ్యాపకుడి హత్యాచారం.. ఎవరూ లేని తరగతి గదిలో..?

మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. వయోబేధం లేకుండా కామాంధులు విరుచుకుపడుతున్నారు. జార్ఖండ్‌లో ఓ బాలికపై అధ్యాపకుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. అది కూడా గణతంత్ర దినోత్సవం రోజునే ఈ ఘటన చోటుచేసుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. వివరాల్లోకి వెళితే.. పలమౌ జిల్లా పంకికి చెందిన బాలిక ఈనెల 26న పాఠశాలకు వెళ్లింది. 
 
ఇదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శంభు సింగ్‌(35) ఆ బాలికను ఎవరూ లేని తరగతి గదికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. తర్వాత.. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పొద్దంటూ బాలికను, ఆమె తల్లిదండ్రులను బెదిరించాడు. అదేరోజు రాత్రి విద్యార్థిని ఇంటికి వెళ్లిన అతను బాలికకు విషపు గుళికలు తినిపించాడు. 
 
కొద్దిసేపటికి ఆ బాలిక అపస్మారక స్థితికి వెళ్లింది. తల్లిదండ్రులు తమ కూతురిని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మరణించింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. బాధిత కుటుంబానికి, ఉపాధ్యాయుడికి మధ్య భూతగాదాలున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.