గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By జె
Last Modified: ఆదివారం, 24 జనవరి 2021 (16:23 IST)

19 యేళ్ళకే ఆ యువతి వన్ డే సిఎం.. ఎక్కడ?

ఒక రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎన్నో ఎత్తుగడలతో రాజకీయ చతురతతో సిఎం పీఠాన్ని ఎక్కాల్సి ఉంటుంది. ఇక సిఎం పోస్టు గురించి మరీ అంతగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి ఆ పదవి గురించి తెలుసు కాబట్టి. కానీ ఒక యువతి మాత్రం అలాంటి సిఎం పదవిని ఈజీగా సంపాదించింది. ఒక్కరోజు ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టనుంది. 
 
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా 20 యేళ్ళు కూడా  నిండని హరిద్వార్ జిల్లా ధవల్ పూర్‌కు చెందిన సృష్టి గోస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు. బాలికా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో బాలికా సంరక్షణ సమితి ఈ నిర్ణయం తీసుకుంది. ఒకరోజు సిఎంగా సృష్టి ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారులతో సమావేశం కానుంది.
 
అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాలని సిఎం ఆదేశించారు. దీంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఒకరోజు సిఎంగా తాను పనిచేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెబుతోంది సృష్టి గోస్వామి.