మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 జులై 2022 (16:38 IST)

కళ్లకురిచిలో ఘటన.. హాస్టల్‌ ప్రాంగణంలో బాలిక శవం.. ఏం జరిగింది?

Kallakurichi
Kallakurichi
తమిళనాడులో దారుణ ఘటన జరిగింది. కళ్లకురిచికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నసేలంలోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ పాఠశాలలో షాకింగ్ సంఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల బాలిక జూలై 13న హాస్టల్ ప్రాంగణంలో శవమై కనిపించింది. 
 
కాగా, బాలిక హాస్టల్‌లోని మూడో అంతస్తులోని ఓ గదిలోని బాల్కనీ నుంచి నేలపైకి దూకి తన జీవితాన్ని ముగించుకుందని అనుమానిస్తున్నారు. మరణానికి ముందు ఆమెకు గాయాలైనట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. అయితే, బాలిక చనిపోవడం వెనుక హాస్టల్ సిబ్బంది ఏవైనా ఉన్నాయా అని బాధిత బాలిక బంధువులు అనుమానించారు.
 
దీంతో.. ఆదివారం గ్రామస్తులతో కలిసి మూకుమ్మడిగా పాఠశాలలో ప్రవేశించి, అక్కడి బస్సులను తగులబెట్టారు. ఆమె మరణంతో దిగ్భ్రాంతికి గురైన ఆమె తల్లిదండ్రులు, బంధువులు, కడలూరు జిల్లా వేప్పూర్‌లోని పెరియనాసలూరు గ్రామం ప్రజలు న్యాయం చేయాలని కోరుతూ నిరంతరాయంగా నిరసనలు చేస్తున్నారు. 
 
విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు 'అంతర్జాతీయ' పాఠశాల అధికారులను నిందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.