గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (14:50 IST)

కాంగ్రెస్‌లో సీఎం కుర్చీ కోసం పోటీ : సిద్ధరామయ్య వైపు ఎమ్మెల్యేల మొగ్గు

dk - siddha
కర్నాటక రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 224 సీట్లకుగాను ఏకంగా 136 స్థానాలను గెలుచుకుంది. దీంతో ముఖ్యమంత్రి పీఠం కోసం కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు పోటీపడుతున్నారు. దీంతో సీఎల్పీ నేత ఎంపికను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగిస్తూ ఏక వాక్యంతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అదేసమయంలో సీఎం అభ్యర్థి ఎంపిక కోసం ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించనున్నారు. మాజీ ముఖ్యమంత్రికి 80 మందికి ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్టు సమాచారం. 
 
కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం మేరకు.. ముఖ్యమంత్రి రేసులో మాజీ సీఎం సిద్ధరామయ్య ముందంజలో ఉన్నారు. పార్టీ ఎమ్మెల్యేల్లో 80 మంది ఆయనకే మద్దతు ప్రకటించారు. ఈ నేతలు ఇద్దరిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నవారికే సీఎం పదవి కట్టబెట్టాలని నిర్ణయించింది. 
 
ఇందులోభాగంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఓ ఓటింగ్‌లో సీనియర్ నేత సిద్ధరామయ్య ముందు వరుసలో ఉండగా, ట్రబుల్ షూటర్‌గా పేరుగాంచిన డీకే శివకుమార్‌ కాస్త వెనుకబడినట్టు తెలుస్తుంది. దీంతో కర్నాటకకు కాబోయే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యేనని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.