శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 16 మే 2018 (13:42 IST)

షాక్... 12 మంది కర్నాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంప్... కనబడటంలేదట...

కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు కలుగుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్

కర్నాటకలో ఎమ్మెల్యేలను అంటిపెట్టుకుని వుండాల్సిన పరిస్థితి జేడీఎస్-కాంగ్రెస్ పార్టీలకు కలుగుతోంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లారన్నది ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మా కొట్టారు. ఈ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కూడా నలుగురు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. దీనితో కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు వారిని వెతికేపనిలో పడ్డారు. 
 
మరోవైపు కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపి తనదైన శైలిలో ప్రయత్నాలు చేస్తూనే వున్నది. ప్రభుత్వ ఏర్పాటుకు కేవలం 8 సీట్లు మాత్రమే కావలసి వుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి దూరంగా వున్న 12 మంది సభ్యులు భాజపా నాయకులతో టచ్ లోకి వెళ్లిపోయారన్న ప్రచారం జరుగుతోంది. మొత్తమ్మీద ప్రభుత్వ ఏర్పాటు ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీలకు కంటి మీద కనుకు లేకుండా వుంది.