గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 15 మే 2018 (08:35 IST)

#KarnatakaElectionResults : కాంగ్రెస్ - బీజేపీల హోరాహోరీ... Live Updates

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 264

దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనున్న కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 224 స్థానాలకు గాను 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2640 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 11 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు.
 
ప్రతీ టేబుల్ వద్ద 100 మంది పర్యవేక్షించనున్నారు. 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా, 9 గంటలకల్లా సరళి వెల్లడి కానుంది. మధ్యాహ్నానికి గెలుపెవరిదో తేలిపోతుంది. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతంలో వంద మీటర్ల వరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. బెంగళూరులో 5 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ప్రతీ కేంద్రంలోనూ 14 టేబుళ్లు ఉన్నాయి. కాగా, బీజేపీ ఎన్నికల పరిశీలకులుగా పీయూష్ గోయల్ జవదేవకర్ వ్యవహరించనుండగా, కాంగ్రెస్ నుంచి అశోక్ గెహ్లట్, ఆజాద్ ఎన్నికల పరిశీలకులుగా నియమితులయ్యారు.
 
కాగా, ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ 61 చోట్ల, బీజేపీ 47 చోట్ల, జేడీఎస్ 16 చోట్ల ఆధిక్యంలో ఉంది. బదామి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెనుకంజలో నుంచి గట్టెక్కి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈయన సమీప ప్రత్యర్థి శ్రీరాములు వెనుకంజలో ఉన్నారు.