మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 ఫిబ్రవరి 2022 (22:18 IST)

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై అస్సాం సీఎం ఫైర్.. సైన్యాన్ని అవమానిస్తే?

సర్జికల్‌ స్ట్రయిక్స్‌‌పై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.  ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ.. మన సైన్యాన్ని అవమానిస్తే నవ భారత్ సహించదు అని హెచ్చరించారు. 
 
కాగా, సర్జికల్‌ స్ట్రైక్‌ విషయంలో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ప్రశ్నలపై కూడా బిశ్వా శర్మ మండిపడ్డారు.  ఫైర్‌ అయిన అస్సాం సీఎం… మీ నాన్న ఎవరు? సాక్ష్యం ఉందా? అని మేం అడుగుతున్నామా? అంటూ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.
 
అస్సాం సీఎం వ్యాఖ్యలపై కేసీఆర్‌ తీవ్రంగా ఖండించిన విషయం కూడా విదితమే. ఎంపీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని మండిపడ్డారు. అంతేగాకుండా సర్జికల్‌ స్ట్రయిక్స్‌కు సాక్ష్యమేదీ? అంటూ ప్రశ్నించారు. 
 
ఈ వ్యవహారంపై స్పందించిన అస్సాం సీఎం డియర్ కేసీఆర్, ఇదిగో మన వీర సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్ వీడియోగ్రాఫిక్ సాక్ష్యం అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో షేర్‌ చేశారు.