బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 జులై 2021 (22:03 IST)

కేరళను వణికిస్తోన్న జికా వైరస్.. 19కి చేరిన కేసులు

కేరళను జికా వైరస్ వణికిస్తోంది. తాజాగా మరోక కేసు బయట పడింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 19కి చేరింది. అనారోగ్యంతో కేరళ రాజధాని తిరువనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 ఏళ్ల వృద్ధురాలికి జికా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

ఆమె నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా జికా వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్ని కేరళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీనా జార్జ్ విలేకరులకు తెలిపారు. 
 
తిరువనంతపురం, త్రిస్సూర్ మరియు కోజికోడ్ మెడికల్ కాలేజీలలో మరియు అలప్పుజలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) యూనిట్లో పరీక్షా సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.