గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 అక్టోబరు 2022 (15:02 IST)

వివాదంలో చిక్కుకున్న కేరళ గవర్నర్... ఎదురు తిరిగిన వీసీ

sitaram yechury
యూజీసీ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉదంటూ ఏపీజీ డాక్టర్ అబ్దుల్ కలాం సాంకేతిక విశ్వవిద్యాలయం ఉప కులపతి నియామకాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇదే పద్దతిలో నియమితులైన మరో తొమ్మిది మంది వైస్ ఛాన్సర్లు కూడా తక్షణం రాజీనామా చేయాలని, వీరి రాజీనామాలు సోమవారం 11.30 గంటలలోపు తన టేబుల్‌పై ఉండాలని కేరళ రాష్ట్ర గవర్నర్ అరిఫ్ ఖాన్ ఆదేశాలు జారీచేశారు. వీటిని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. 
 
అయితే, సోమవారం ఉదయం 11.30 గంటలలోపు కేరళలోని తొమ్మిది యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు రాజీనామా చేయాలని గవర్నర్ ఆరీఫ్ ఖాన్ జారీచేసిన ఆదేశాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఈ పరిస్థితిలో, మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు సీతారాం ఏచూరి కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ జారీ చేసిన ఉత్తర్వును తీవ్రంగా ఖండించారు. 
 
"అలాంటి ఉత్తర్వు జారీ చేసే అధికారం గవర్నర్‌కు లేదు. ఇది ఏకపక్షం, ఇది చట్టవిరుద్ధం, ఇది రాజకీయ ప్రేరేపితమైనది. కేరళ ఉన్నత విద్యావ్యవస్థను నియంత్రించి నాశనం చేయాలనుకుంటున్నారు. అక్కడ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను నియమించి ఉన్నత విద్యావ్యవస్థను నియంత్రించాలన్నారు. తద్వారా విద్యాసంస్థల్లో హిందుత్వ భావజాలాన్ని ప్రచారం చేయవచ్చు. అలాంటి ఉత్తర్వును గవర్నర్ జారీ చేయడానికి రాజ్యాంగం అనుమతించదు. దీనిపై కోర్టులో అప్పీలు చేస్తాం" అని ఆయన అన్నారు. 
 
మరోవైపు, గవర్నర్ ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని కున్నూరు విశ్వవిద్యాలయం వీసీ చెప్పారు. ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూద్దామని వెల్లడించారు. గవర్నర్ నిర్ణయాన్ని ఎల్.డి.ఎఫ్ తప్పుబట్టారు. విద్యను కాషాయికరణ చేయడానికి సంఘ్ పరివార్ చేస్తున్న కుట్రను అడ్డుకుంటున్నందువల్లే గవర్నర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.