మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 3 ఏప్రియల్ 2021 (16:38 IST)

ఏప్రిల్ ఫూల్స్ డే: కేరళలో ఆ యువకుడు ఉరేసుకోబోయాడు.. చివరికి..?

ఏప్రిల్ ఫూల్స్ డే గురించి తెలిసిందే. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున స్నేహితులను ఫూల్ చేయబోయిన ఓ యువకుడు ప్రాణాలను కోల్పోయాడు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు స్నేహితులను ఫూల్‌ చేయబోయిన ఓ యువకుడు ఉరికి చిక్కుకుని మరణించాడు. కేరళలోని అలప్పుజ జిల్లాలో ఏప్రిల్‌ 1న ఈ ఘటన జరిగింది.
 
వివరాల్లోకి వెళితే.. తలావాడికి సమీపంలోని కిలిరూర్‌లో 17 ఏండ్ల సిద్దార్థ్ అజయ్ తన తల్లిదండ్రులు, సోదరితో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రి భోజనం తర్వాత తన గదిలోకి వెళ్లాడు. చాలా సేపటి వరకు అతడు గది నుంచి రాకపోవడంతో తల్లి వెళ్లి చూడగా సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
 
మరోవైపు ఆ గదిలోని కిటికీ వద్ద అతడి మొబైల్ ఫోన్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో ఉన్నది. దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులను ఫూల్‌ చేయబోయిన సిద్దార్థ్‌ మెడకు బెడ్‌షీట్‌ చిక్కుకోవడంతో మరణించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.