శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (16:23 IST)

కేరళలో కరోనాకు కొత్త పద్ధతి.. ప్లాస్మా థెరపీకి రంగం సిద్ధం..

కేరళలో ఇవాళ కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా అనుమానిత కేసులు 286 నమోదవగా..వీటిలో 256 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇక కోవిడ్-19 కారణంగా విషమ పరిస్థితుల్లో వున్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా మళ్ళీ ఆరోగ్యవంతులను చేసేందుకు కేరళ ప్రభుత్వం నడుం కట్టింది. 
 
అయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నవారి రక్తంలోని యాంటీ బాడీలను వినియోగించుకోవలసి ఉంటుంది. ఈ థెరపీ క్లినికల్ ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టిన కేరళ ఈ తరహా ప్రయోగానికి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపిందని అధికారి ఒకరు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్స్‌టి‌ట్యూట్ ఫర్ మెడికల్ అండ్ సైన్సెస్ టెక్నాలజీ ఈ దిశగా ప్రయోగాలు చేపడుతుందని కేరళ ప్రభుత్వాధికారి తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ట్రయల్స్ ప్రారంభిస్తుందన్నారు. 
 
ఇప్పటికే ప్లాస్మా థెరపీకి సంబంధించి చైనా, అమెరికా దేశాల్లో కొంత అధ్యయనం జరిగింది. కానీ ఈ చికిత్సా విధానం బాగా పని చేస్తుందని ఇప్పుడే చెప్పలేమని కేరళ ప్రభుత్వాధికారి తెలిపారు.