శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:55 IST)

కరోనాను ఓడించిన కేరళ వృద్ధ దంపతులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వృద్ధులకు సోకితే ఇక ఆశలు వదులుకోవాల్సిందేనన్న ప్రచారం సాగింది. కానీ, ఈ వృద్ధ దంపతులు మాత్రం అది తప్పు అని నిరూపించారు. ఈ వృద్ధ దంపతులు కరోనాను జయించారు. ఫలితంగా వారిద్దరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 
 
కేరళ రాష్ట్రంలోని పత్తనంతిట్ట ప్రాంతానికి చెందిన ఈ వయోవృద్ధ జంటకు కరోనా సోకడంతో ఆస్పత్రిపాలయ్యారు. వారిని ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తూ వచ్చారు. అయితే, మీడియా జరుగుతున్న ప్రచారంతో బాధితుల కుటుంబీకులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వారిపై ఆశలు వదులుకున్నారు.
 
కానీ, ఆ వృద్ధ జంట కరోనాను జయించింది. వీరిలో వృద్ధ భర్త వయసు 93 ఏళ్లు కాగా, భార్య వయసు 88 సంవత్సరాలు. వారి తనయుడు కొన్నిరోజుల క్రితం ఇటలీ నుంచి కుటుంబసమేతంగా స్వస్థలానికి వచ్చాడు. కొడుకు ద్వారా ఆ వృద్ధ దంపతులకు కరోనా సోకింది. దాంతో వారిద్దరినీ కొట్టాయం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు అందించిన చికిత్సతో ఇరువురు వైరస్ బారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. దీంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.