గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (18:27 IST)

కరోనా వైరస్‌ను పరీక్షించిన బెర్లిన్ మేయర్.. ఎలా?

తన శరీరంలో రోగనిరోధకశక్తి గొప్పదా లేగా కరోనా వైరస్ శక్తిసామర్థ్యం గొప్పదా అని తెలుసుకోవాలని ఓ వ్యక్తి తలచాడు. అంతే.. వెంటనే కరోనా వైరస్‌ను తనశరీరంలోకి ఎక్కించుకున్నారు. ఇంతకీ ఆ ప్రబుద్ధుడు ఎవరో తెలుసా? జర్మనీలోని బెర్లిన్ జిల్లా మేయర్ గారు. పేరు స్టీఫెన్ వాన్ డాస్సెల్. పైగా, తాను ఊహించినదానికంటే కరోనా శక్తి వరస్ట్ అంటూ భావించాడు. అందుకే ఈ వైరస్‌ను ఉద్దేశ్యపూర్వకంగా తన శరీరంలోకి ఎక్కించుకున్నాడు. 
 
ఆ తర్వాత ఈయనగారికి ఆ వైరస్ పవర్ ఏంటో తెలిసివచ్చింది. తాను ఊహించిన దానికంటే అనారోగ్యం ఎక్కువ కాలం ఉందని తెలిపారు. వైరస్‌ను ఎదుర్కొనే నిరోధక శక్తిని సాధించాలనే ఉద్దేశంతో ఇన్ఫెక్షన్‌ను ఎక్కించుకున్నానని చెప్పారు. ఒక మూడు రోజుల పాటు అనారోగ్యంతో ఉంటానని, ఆ తర్వాత రోగనిరోధక శక్తిని సాధిస్తానని భావించానని తెలిపారు. అయితే తాను ఊహించిన దానికంటే పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. తన నుంచి వైరస్ ఎవరికీ సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు.
 
ఈ వైరస్ సోకిన తర్వాత తాను 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నట్టు చెప్పారు. పైగా, తన భాగస్వామికి కూడా ఈ వైరస్ సోకిందన్నారు. అయితే, ఈ వైరస్ సోకకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందన్నారు. లేనిపక్షంలో నిలువరించలేమని తెలిపారు. 
 
అయితే కావాలనే వైరస్‌ను సోకించుకున్న స్టీఫెన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచం కోసమే తాను ఈ పని చేశానని చెప్పారు. కరోనా విస్తరణను కట్టడి చేయడమే తన లక్ష్యమని అన్నారు. తాను ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా బయటపడిన తర్వాతే క్వారంటైన్ నుంచి బయటకు వస్తానని తెలిపారు.